![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'( karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -273 లో..... అసలు ఎవరు సాయం చేసి ఉంటారని కాశీతో కార్తీక్ అనగానే..మావయ్య గారు అయి ఉంటారని కాశీ అంటాడు. అయన అంత సీక్రెట్ గా సాయం చేసి వెళ్లిపోయే రకం కాదు.. అయిన అలాంటి వాళ్ళ సాయం అవసరం లేదని కార్తీక్ అంటాడు. సాయం చేసింది మీ పిన్ని అని తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతారోనని దీప అనుకుంటుంది. నీకు ఏమైనా తెలుసా అక్క అని దీపని కాశీ అడుగుతాడు. తనకి ఏం తెలుసుస్తుంది. తన టెన్షన్ లో తను ఉందని కార్తీక్ అంటాడు.
ఆ తర్వాత శౌర్య ఆపరేషన్ గురించి దీప టెన్షన్ పడుతుంది. అప్పుడే డాక్టర్ వచ్చి ఆపరేషన్ సక్సెస్ అని చెప్పగానే.. దీప, కార్తీక్ ల ఆనందానికి అవధులు లేకుండా పోతాయ్. మరొకవైపు కావేరి ఎక్కడికి వెళ్ళిందని శ్రీధర్ టెన్షన్ పడుతుంటాడు. అప్పుడే కావేరి వస్తుంది. ఎక్కడికి వెళ్ళావని అడుగగా.. పూజ సామాను కొనడానికి అని అబద్దం చెప్తుంది. కావేరి కంగారుపడుతుంటే తనకి అబద్ధం చెప్పిందని శ్రీధర్ కి అర్థమవుతుంది.
కార్తీక్, దీపలు ఇంతవరకు వాళ్ళు పడ్డ బాధని గుర్తుచేసుకుంటారు. కార్తీక్ ఏడుస్తు.. శౌర్యకి ఇలాంటి పరిస్థితి వచ్చిందని ఎమోషనల్ అవుతాడు. శౌర్యకి నాన్నని అవ్వడం కోసం నీ మెడలో తాళి కట్టాను.. అది నాన్న అని మొదటి సారి పిలిచినప్పుడు తన కంట్లో మెరుపు చూసాను.. తను బతుకుతుందని నమ్మకం వచ్చిందంటూ కార్తీక్ బాధపడతాడు. కార్తీక్ చిన్నపిల్లాడిలాగా దీప, కాళ్ళపై తల వాల్చి పడుకుంటాడు. అప్పుడే నర్సు వచ్చి పాప స్పృహలోకి వచ్చిందని చెప్పగానే.. ఇద్దరు శౌర్య దగ్గరికి వెళ్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |